TT Ads

పాత ముచ్చట్లతో సెంటిమెంట్

–సంబురంగా కేసీఆర్ ప్రచారం

–అల్లుడు కొడుకు లను ఆకాశానికి ఎత్తిన కేసీఆర్

-బావా బామ్మర్దులు కుడి, ఎడమ భుజమైనందుకే నా.. ?

–సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు జరగలేదు…?

— ఈ నియోజకవర్గాలపై అమిత ప్రేమ ఎందుకు ..?

— వీళ్లేనా, తెలంగాణ ప్రజలు, మిగతా వాళ్ళు కారా..?
— ప్రశ్నిస్తున్న యావత్ తెలంగాణ ప్రజలు

కొండం అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
ఫోన్ : 9603322489

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా హైదరాబాద్:

ముఖ్యమంత్రి కెసిఆర్ తిమ్మిని పంపించడంలో దిట్టగా పేరొందారు.. దీనికి నిదర్శనం గా సిద్దిపేట, సిరిసిల్ల బహిరంగ సభలలో ప్రసంగించిన తీరు నిజమేనని తెలియజేస్తోంది.. ఆనాటి , పాతకాలపు ముచ్చట్లు చెప్పి… మరింత కన్న భూమి సెంటిమెంటును రగిల్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఆరడుగుల బుల్లెట్టు మీ మీదికి వదిలాను… ఆ బుల్లెట్టు పనితీరు అమోఘం అంటూ ఆకాశం ఎత్తారు… ఒక దశలో నేను(కేసీఆర్) మీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉంటే కూడా ఈ ఆరడుగుల బుల్లెట్టు కంటే తక్కువ చేసే వాడినేమో.. అని స్వయంగా సీఎం కేసీఆర్ తన అల్లుడిని పొగడ్తలతో ముంచెత్తారు.. ఒకప్పటి సిద్దిపేట తాగునీరుతో అలమటించింది… ఆనాడు, కరీంనగర్ మానేరు డ్యాం నుంచి నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి …. ఈనాడు సిద్దిపేట ఏ రకంగా అభివృద్ధి చెందింది.. అనే విషయం మీ అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది… అంటూ, తను చిన్ననాడు పడిన కష్టాలను సైతం తెలియజేసి, మరో మారు సెంటిమెంటును రగుళింప చేశారు.. ఇది కెసిఆర్ మాటల గారడి తీరు పై ప్రజలు మరోసారి మోసపోవడానికి తయారుగా ఉన్నారా…? లేరా..? అనే అంశాన్ని పట్టించుకోకుండా , చెప్పిందే చెబుతూ, అల్లుడిని తెగ పొగుడుతూనే…. నేను పెద్దగా మీ మంత్రి హరీష్ రావు గురించి చెప్పను …అంటూ సన్నాయి నొక్కులతో ప్రసంగం చేశారు…

సిరిసిల్లలో తారక రాముడు:

అలాగే, సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న మంత్రి తారక రాముడికి మంచి భవిష్యత్తు ఉంది.. మరో మారు గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని సీఎం కేసీఆర్ పదేపదే కోరారు.. ధరణి అంశాన్ని ప్రస్తావిస్తూ …ఏమర్చి ఉంటే, మళ్ళీ కాంగ్రెస్ వాళ్లు వస్తారు.. ధరణి ఎత్తేస్తారు.. మళ్ళీ పాతపాటే ఒకరి భూమికి ఇంకొకరికి నా భూమి నీకు నీ భూమి ఇంకొకరికి అన్నట్లుగా, కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని పదేపదే చెప్పడం వెనుక అర్థమేంటి..? అనే విషయాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు ..అంటే, ఒక రకంగా తాము “ఓటమి పాలు” అవుతామని, ఇప్పుడే ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని ముందస్తు ఆలోచనతో రాబోయే సంకట స్థితిని గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ మాటలు చెప్పకనే చెబుతున్నాయి ..స్థానిక మంత్రి వల్ల నేడు చేనేత కార్మికులు ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారని, స్వయంగా చేనేత మంత్రి కావటం వల్ల ఇక్కడి చేనేతలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామని అన్నారు..

బతుకమ్మ చీరలు కట్టుకుంటే కట్టుకోండి… లేకుంటే లేదు:

రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు స్థానిక మంత్రి రామారావు బతుకమ్మ చీరలను సిరిసిల్ల నుంచి తయారు చేయించాలని ఒక పథకాన్ని పట్టుబట్టి తీసుకొచ్చారన్నారు.. అయితే, ఈ చీరలన్నిటిని ప్రభుత్వపరంగా బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరల పేరుతో మహిళలకు అందిస్తున్నాం… అయితే , కొంతమంది ఈ చీరలు మంచిగా లేవని కాలబెడుతున్న తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చీరలు కట్టుకుంటే కట్టుకోండి.. లేకుంటే లేదు.. మీకేంటి ఇబ్బంది.. మీరు అడిగితే ఏమన్నా ఇస్తున్నామా..? ఇదేంటి… నాకు అర్థం కాదు.. అంటూ బతుకమ్మ చీరల నాణ్యతలేని విషయమై మహిళలు నిరసన వ్యక్తం చేసిన తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం స్థానికంగా కలకలం రేపింది.. మహిళలపై ఉన్న అభిమానం ఇదేనా..? అని సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు ఆగ్రహం తెప్పించింది ..

నిధులన్నీ మీ కుటుంబ నియోజకవర్గాలకేనా..?

రాష్ట్రంలోని ఆదాయం మొత్తాన్ని గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గం పరిమితం చేస్తారా..? ఈ మూడు నియోజకవర్గాల్లో ఒకే కుటుంబానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కేటాయిస్తున్నారా…? అక్కడి ప్రజలే తెలంగాణ ప్రజలా..? ఆ మూడు నియోజకవర్గాల్లో వేసిన ఓట్ల ద్వారానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందా..? గజ్వేల్ ,సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనులను మిగతా నియోజకవర్గాలలో ఎందుకు జరగడం లేదు …? అనే అంశాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు… మీ కుటుంబ సభ్యులు ఉంటేనే అదనపు నిధులు ఇస్తారా …? ఏ సంక్షేమ పథకం అయినా … ఏ ప్రాజెక్టు అయినా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు.. మరి, పక్కనే ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదు..? ఇక్కడి రైతుల బాధలు మీకు పట్టవా..? కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ గౌరవల్లి ప్రాజెక్టు ఇంకా పెండింగ్ లోనే ఉంది.. ఎందుకు ..? మీ గజ్వేల్, సిద్దిపేట , సిరిసిల్ల ప్రాంతాలలో చేపట్టిన ప్రాజెక్టులు తొందరగా పూర్తవుతాయి.. మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు కావు..? అనే అంశాలను పరిశీలిస్తే వివక్ష అనేది స్పష్టంగా అర్థమవుతుంది … ఇకనైనా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో అభివృద్ధి పనులను చేపడితే బాగుంటుంది.. అంతేకానీ, కుటుంబ పాలనలో ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తే ,తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగినట్లు కాదని టిఆర్ఎస్ నాయకులు తెలుసుకుంటే మంచిదని ప్రజలు సూచిస్తున్నారు..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *