BiRS ;. మా మేనిఫెస్టో రిలీజ్ కాగానే.. ప్రతి పక్షాలమైండ్ బ్లాంక్ అవడం ఖాయం; హరీష్ రావు

0
10

ఈ నెల 15 న బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ పక్కన మైదానంలో ఈనెల 15 న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబల్స్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండి పడ్డారు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనియ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెసోల్లు ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ ఉంటారని, మాటలు, మూటలు, ముఠాలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరని విమర్శించారు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బిజెపి వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ కు ఇచ్చిన గొప్ప వరమని పేర్కొన్నారు. 2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదన్నారు.

2004 లో తెలంగాణ ఇస్తామని టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీని మింగేయాలని చూసిందన్నారు. మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బిజెపి వాళ్ళు మంచివాల్లో, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడా రైతులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతని, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారిందన్నారు.

వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయిందని వెల్లడించారు. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే తెలంగాణ అభివృద్ధిలో కిందకి పడిపోతుందన్నారు.హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here