నేను గజ్వేల్ శాసన సభ్యుడు గానే ఉంటాను… బి.ఆర్.ఎస్. అధినేత కేసిఆర్..!!

0
4

గులాబీ బాస్  కేసీఆర్  లో గుబులు మొదలైంది. ఐదు  ఏండ్లు కార్య కర్తలకు టచ్ లో లేని కె.సి.ఆర్.ఇప్పుడు వాళ్ళను బుజ్జగిస్తున్నారు.నేను  గజ్వేల్ ను ఎంతో అభివృద్ధి చేసాను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇక నేను ఎవరిని నమ్మను అని కె.సి.ఆర్ అన్నారు.

 శుక్రవారం సొంత నియోజకవర్గం గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేను ప్రతి నెల మీతో సమావేశం నిర్వహిస్తాను నన్ను నమ్మండి  నేను కామా రెడ్డి లో పోటీ చేయడానికి ఓ కారణం ఉంది అది తర్వాత చెప్పాలి నేను ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్ ని వదిలిపెట్టను రెండు చోట్ల గెలిచినప్పటికీ గజ్వేల్ శాసనసభ్యుడు గానే ఉంటాను అని కెసిఆర్ అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోందో తమ అంచనాలు వెల్లడించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తనకు తెలిసినంతవరకు బీఆర్ఎస్ కు 95 నుంచి 105 స్థానాలు వస్తాయని తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదని, ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ కార్యకర్తలను నాయకులను ఆయన ఎంతగా రిక్వెస్ట్ చేసే విధానం చూస్తుంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు

ఓ కారణంతోనే తాను ఈసారి కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని, అయితే గజ్వేల్ ను వదిలిపెట్టి వెళ్లబోనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి తలమానికంగా ఉండేలా గజ్వేల్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఉద్ఘాటించారు.

కాగా, గజ్వేల్ లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ సెంటిమెంటుగా వస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎదుట పార్టీ వారు చెప్పింది వినొద్దు వాళ్లు మన అభివృద్ధిని అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తారు వాళ్ళు ఏమి చెప్పినా ఒక చెవితో విని మరో చెవితో వదిలేయండి. నేను గజ్వేల్ అభివృద్ధి కట్టుబడి ఉన్నాను ,ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తన ఆశీస్సులు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త నాయకుడు కేసీఆర్ లాగానే భావించాలి నేను పార్టీ కోసం ఈ విధంగా పనిచేస్తున్నానో మీరు కూడా అదే విధంగా పని చేయాలి.  గతం లో కంటే పెద్ద మెజార్టీతో గెలిపించాలి.నేను ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్ లో వదిలిపెట్టను అంటూ పదేే పదే చెప్పుకుంటూ వచ్చారు. అభివృద్ధి నాది గెలిపించేది మీరు అంటూ కేసిఆర్ కార్యకర్తలకు హితవు చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here