ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుకూల ఫలితాలు వస్తాయో రావో అని అనుమానంలో అధికార వై ఎస్ సి పి ఉన్నట్లు కనిపిస్తోంది . విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రజల రిఫరెండం గా తీసుకుంటారా అని విలేకరుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. 200% మేమే మేమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్ చేసిన ట్వీట్ లో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ లో ఉన్నవారే హిందువులు అని అనడం కరెక్ట్ కాదని . అని ఆయన అన్నారు . బిజెపి ప్రజల సంక్షేమం పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తుందని బొత్స మండిపడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వైసీపీ పార్టీ నిర్వహించిన సమావేశానికి హాజరైనట్లు విలేకరులు మంత్రి దృష్టికి తేగా సూట్ బూట్ వేసుకొని వస్తే అధికారుల్లా విలేకరులకు కనిపిస్తున్నారని ,మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించారు . దానికి విలేకరులు మా దగ్గర వీడియో ఉందని మరి చర్య తీసుకుంటారా అని అడగడం తో వి సి హాజరైన విషయం నాకు తెలియదని చట్టం ముందు అందరూ సమానమనేని ఒకవేళ హాజరైతే ఆయన మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు