TT Ads

*తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరటం ఖాయం- రాజ్ నాథ్ సింగ్*

మహేశ్వరంలో కమలం పువ్వు వికసిస్తుంది- కిషన్ రెడ్డి
*కేసీఆర్ కుటుంబ పాలనకు ఈ ఎన్నికలతో చరమగీతం- ప్రకాశ్ జవదేకర్*
మంత్రి సబితమ్మ వర్గం దోచుకోవటం, దాచుకోవటమే – బొక్క నర్సింహారెడ్డి
*ఈ ప్రాంతాన్ని నాశనం చేసేందుకే సబితమ్మ వచ్చింది- అందెల.*
గొంగడి, గొర్రెపిల్లతో రాజ్ నాథ్ సింగ్ ను సత్కరించిన శ్రీరాములు యాదవ్.

మహేశ్వరం జనగర్జనతో బీజేపీ గెలుపు ఖాయమని రాష్ట్ర అగ్రనేతలు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ ఏల్మేటి దేవేందర్ రెడ్డి, బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిరిపురం యాదయ్య ప్లే గ్రౌండ్ లో జరిగిన మహేశ్వరం జనగర్జనలో ముఖ్య అతిధిగా కేంద్ర రక్షణ శాఖమాత్యులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్, మహేశ్వరం జనగర్జన సభలతో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావటం ఖాయమన్నారు.
ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి ఈసారి ఓటమి తప్పదని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ చేతిలో మంత్రి సబితమ్మ కీలుబొమ్మ అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం తప్పా… తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమీ లేదని రాష్ట్ర ఇన్ఛార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న సంపదను దోచుకోవటం- దాచుకోవటం తప్పా మంత్రి సబితకు పాలనపై శ్రద్ధ లేదన్నారు జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి.
అనంతరం అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ… ఫార్మా, ప్యాబ్ సిటీల్లో భూములు కోల్పోయినా రైతు కుటుంబాలకు, స్థానికులకు ఏర్పాటు చేసిన కంపెనీల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. షాడో మంత్రి కార్తీక్ రెడ్డి భూకబ్జాలు చేస్తూ… మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆగం చేస్తున్నారని శ్రీరాములు యాదవ్ మండిపడ్డారు. బడంగ్ పేట కార్పొరేషన్ లో దళితుల భూములను లాక్కొని పెద్దలకు దారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, జిల్లా, జాతీయ నాయకులు సహా బీజేపీ, బీజేవైఎం, మహిళామోర్చాతోపాటు అన్ని మోర్చాల ప్రతినిధులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *