TT Ads

తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ..మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తి కానుంది… టైం లేదు. తీరిక‌గా కుర్చోని ఆలోచించేంత స‌మ‌యం కూడ లేదు… మరోవైపు అన్ని ప్రధాన ప్రత్యర్థి పార్టీలు ఎన్నిక‌ల క‌ద‌న రంగానికి కసరత్తులు చేస్తూ స్పీడ్ పెంచుతున్నాయి. ఇలాంటి టైంలో బీజేపీ పార్టీలో వర్గపోరుతో ర‌గ‌లిపోతోంది. ఆ పార్టీ నాయ‌కుల మ‌ద్య ఏర్ప‌డిన వర్గపోరు తీవ్ర కలవరం సృష్టిస్తోంది.

ప్రస్తుతం ఆ పార్టీలో అంతా అయోమయం.. జ‌గ‌న్నాధం అన్న‌ట్లు ఉంది ప‌రిస్థితి… దాదాపు 40 రోజులుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు.. చ‌డి చప్పుడు లేదు. రాష్ట్ర అధ్యక్షుడు మారినప్పుటి నుంచీ పార్టీలో ఏం జరుగుతుందో ఎవ‌రికి తెలియ‌టం లేదు.. నేతల్లోను కార్యకర్తల్లోను ఆంతా అయోమయం.. పార్టీలో నెలకొన్న వర్గపోరు హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

జాతీయ జెండా సాక్షిగా తెలంగాణ బీజేపీలో నెలకొన్న వర్గపోరు ఒక్క‌సారిగా బజారున పడి ర‌చ్చ ర‌చ్చ అయింది. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి-హమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మీ భర్త రామన్నగౌడ్ వర్గీయుల మధ్య ఆగస్టు 15న జ‌రిగిన గోడ‌వ రచ్చక్కెంది. ఈ వ్యవహారం కాస్తా రెడ్డి వర్సెస్ బీసీగా మారడంతో ఆ పార్టీలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి అర్థం కాకా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు ఆ పార్టీ నేత‌లు .. ఢిల్లీ అగ్ర నాయకత్వం తెలంగాణ‌లో బీసీలకు అనుకులంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్‌కు పదవి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.. బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లను కూడ ప్రోత్సహించినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. కానీ ఇప్పుడు పార్టీలో జ‌రుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. పైకి మాత్రమే బీసీ జపం చేస్తున్నారు… కానీ..లోప‌ల మాత్రం రెడ్డి సామాజికవర్గనికే అగ్ర నాయకత్వం అంద‌లం ఇస్తోందని రామన్నగౌడ్ చేస్తున్న మాట‌ల‌ను బట్టి తెలుస్తోంది. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతుంటే.. ఓక వ‌ర్గం నాయ‌కులు మాత్రం తనను తొక్కేస్తున్నారని ఆయ‌న మీడియ ముందు వాపోయారు..ఈ వ్యవహారంపై ఇరు వర్గాల నేతలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు గొడవలు పడడంపై కిషన్‌రెడ్డి కూడ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం జరిగే పనులు చేస్తే మాత్రం వేటు తప్పదని కిషన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు సమాచారం.

ఓ వైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో వడపోతల్లో మునిగితేలుతుంటే.. కమలం పార్టీలో మాత్రం గ్రూప్ తగాదాలతో సతమతమవుతోంది. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ అగ్ర నాయకత్వం సీరియ‌స్ గా తీసున్న‌ట్లు తెలుస్తోంది. వ‌ర్గ‌పోరు మ‌రింత ముద‌ర‌క ముందే ఎండ్ కార్డ్ ప‌ల‌కాల‌ని అధిష్థానం భావిస్తున్న‌ట్లు వినికిడి. అసంతృప్తులను బుజ్జగించి ముందుకెళ్తుందో.. లేదంటే ధిక్కార స్వరం వినిపించే నాయకులపై వేటు వేస్తుందో వేచి చూద్దాం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *