TT Ads

తెలంగాణలో బీజేపీ ప్లాన్ చేంజ్

ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధిష్టానం

కనీసం 12 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేందుకు రెడీ అవుతున్న యాక్షన్ ప్లాన్

తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ఇప్పటి వరకూ దూకుడుగా వెళ్లింది. ఇప్పుడు కాస్తా దుకుడు త‌గ్గించి మ‌రో ప్లాన్ తో రంగంలోకి రావాటానికి సిద్ద‌మ‌వుతోంది. ఫిబ్రవరి నుంచి ఇక క్షేత్ర స్థాయిలో దూసుకుపోవాల‌ని నిర్ణయించుకుంది. రాష్ట్ర స్థాయిలో జోరు మీదున్న కాష‌య ద‌ళం ఇక క్షేత్ర స్థాయిలో కూడ త‌న స‌త్తా చాటాల‌ని చూస్తోంది. నియోజకవర్గ స్థాయిలో బీజేపీ బలపడలేదన్న అభిప్రాయం జ‌నాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఇక క్షేత్ర స్థాయిలో కూడ త‌న స‌త్తా చాటాల‌నే అలోచ‌న‌తో ప్లాన్ చేంజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ్రామ, గ్రామానికి వెళ్లి ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను క‌ల‌వాల‌ని నిర్ణయించుకుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలను బలోపేతం చేసి వాటితో క్షేత్ర స్థాయిలో త‌మ బ‌లం పెంచుకోవాని ప్లాన్ చేస్తోంది. పార్టీలోని ముఖ్య నాయకులంద‌రు పాదయాత్రలు, బస్సు యాత్రలను ప‌క్క‌న పెట్టి, గ్రామాల‌కు వెళ్ల‌ల‌ని ఆధిష్టానం అదేశాలు వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నియంగా తెలుస్తోంది.

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కొని బీజీపీ అనుకూల శక్తులు విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఫామ్ హౌస్ కేసులో ఆరెస్సెస్ అగ్రనేత ఇరికించి, నోటీసులివ్వడంతో కేసీఆర్‌ సర్కార్‌ తమతో పెట్టుకుందని భావిస్తున్నారు. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని అన్ని పరివార, అనుబంధ సంఘాలకు సంఘ్‌ పరివార్‌ పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్‌కు ఇప్పటి వరకూ కవచంలా ఉన్నా తెలంగాణ సెంటిమెంట్ కూడా బీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో బలహీనపడింద‌ని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని వ్యూహకర్తలు మేసేజ్ పంపుతున్నారు.

బీజేపీ కొత్తగా ఏ రాష్ట్రంలో విజయం సాధించినా.. ఆరెస్సెస్ పాత్రను ఎవరూ కాదనలేరు. పైకి కనిపించకుండా .. ఇంటింటి ప్రచారం చేస్తూ.. బీజేపీకి ఓటర్లుగా మార్చడంలో వీరి పాత్ర కీలకం. త్రిపుర, అసోం లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందంటే దానికి కారణం ఆరెస్సెస్ ఏళ్ల తరబడి ప్రణాళికాబద్దంగా పని చేయడమేనని రాజకీయవర్గాలు నమ్ముతాయి. ఇప్పటికే తెలంగాణ ఉన్న రాజకీయ పరిస్థితులపై ఆరెస్సెస్ ఓ నివేదిక రెడీ చేసుకుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీపరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీపరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలు ప్రస్తావించినట్టు సమాచారం. ఆరెస్సెస్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పూర్తిస్థాయిలో కృషి చేయాలని తెలంగాణ బీజేపీకి రూట్ మ్యాప్ అందినట్లుగా చెబుతున్నారు.

ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టి భారీ ఎత్తున‌ సభలు, సమావేశాలు నిర్వహంచాలని నిర్ణయించారు. 119 నియోజక వర్గాల తెలంగాణలో 9 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 56 బూత్‌ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖ్‌ను నియమించారు. బూత్‌ స్థాయిలో ఎలక్షన్‌ ఇంజనీరింగ్‌ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీలో సమన్వయ లోపం వల్లనే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఆరెస్సెస్ విశ్లేషించినట్లుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పరివార్‌ అనుబంధ సంస్థలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలనిపైన‌ల్ గా తీర్మానించారు. ఇప్పుడు బీజేపీ రాజకీయంగా పోరాడుతుంది. ఆరెస్సెస్ మాత్రం చాపకింద నీరులా తెలంగాణలో బీజేపీ విస్తరణకు ప్రయత్నించనుంది. తెలంగాణలో ఆరెస్సెస్ శాఖలు బలంగానే ఉన్నాయి. లేకపోయినా ఆరెస్సెస్ సభ్యులు.. తమకు కేటాయించిన చోటే ఉండి.. పరిస్థితుల్ని చక్కదిద్దడంలో నిష్ణాతులుగా ఉంటారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ బీజేపీతో పాటు ఆరెస్సెస్‌తోనూ పోరాడాల్సి ఉంది.

ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, హూంమంత్రి అమిత్‌ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లో నేతలను చేర్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో వారిని చేర్చుకునే విషయంలో మాత్రం కాస్తా ప‌క్క‌న పెట్టే ఆలోచనలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఏ పదవిలోనూ లేని పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నేతల విషయంలో వ్యతిరేకత ప్రభావం ఉండదని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.

కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అదే జరిగితే.. పార్టీలోనూ పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో అధికారం సాధించడంతో పాటు సార్వ త్రిక ఎన్నికల్లో కనీసం 12 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్ట‌కుంది కాషాయ‌ద‌ళం. కేబినెట్‌లో జరిగే మార్పుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఉంటుం దని, మరో కేంద్ర మంత్రి పదవి లభించవచ్చని అంటున్నారు. అదే జరిగితే రాష్ట్ర నాయకత్వంలోనూ మార్పులుజ‌రిగే ఆవ‌కాశం వుంటోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారం చేపట్టబోయే రెండో రాష్ట్రం తెలంగాణే కావాలని బీజేపీ పెద్దలు పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కొన్ని కేసుల వ్యవహారాల్లోనూ.. బీజేపీ పెద్దలు ఇబ్బంది పడటంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *