TT Ads

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కు అధికారికంగా లేఖ అందింది.

 డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు  ముహూర్త సమయాన్ని “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని , అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  నిర్ణయించారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవనులో శనివారం ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడంజరుగుతుంది.

అనంతరం సీఎం కేసిఆర్  బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. .

 తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు.

వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్  కోరారు..

.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *