
ఉత్తరాదిలో “దడ పుట్టిస్తోన్న” రాహుల్ గాంధీ జోడో యాత్ర
మంచు వర్షం లా కురుస్తోంది. ప్రతికూల వాతావరణ ,రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ అఖిల భారత మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు,వాయినాడ్ లోకసభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన జో డో యాత్ర జోరుగా కొనసాగుతోంది .
ఈ యాత్ర హర్యానాలో కొనసాగుతోంది . ఎముకలు గడ్డ కట్టే చలి ని లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు . ప్రస్తుతం ముఖ్య మంత్రి మనోహర్ లాల్ కట్టర్ స్వంత నియోజక వర్గం లో కూడా రాహుల్ గాంధీ కి ప్రజల నుండి విశేష ఆదరణ లబిస్తోంది . ముఖ్యంగా ఆయన రైతులను కలవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో చెరుకు పంట కు కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులు,రైతుసంఘాలనాయకులను కలుసుకుంటున్నారు.వారు చెపుతున్న మాటలను ఓపికతో వింటున్నారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సమస్యల తో పాటు తమ దృష్టికీ అన్ని మేజర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఆడుగులు ముందుకు వేస్తున్నారు రాహుల్ గాంధీ.
భారత రాష్ట సమితి కిసాన్ జాతీయ అద్యక్షుడు గుర్నామ సింగ్ కూడా హర్యానా చెందిన వారే. ఆయన రాష్టంలో ముఖ్యమైన రైతు నాయకుడు . భారతీయ జనతా పార్టీ కి వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో కీలక నేతగా వ్యవహిరయించాడు. ప్రస్తుతం రాహులు జోడో యాత్రలో పాల్గొనకూడదని చెప్పినప్పటికీ చాలిని లెక్క చేయకుండా రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ ఆయనతో అడుగులు వేస్తున్నారు ప్రతి కూల వాతావరణ పరిస్తుతుల్లోనూ హర్యానా ప్రజల నుండి రాహుల్ గాంధీకి ఊహించని అధరణ లభిస్తోంది .ఇక్కడ దళిత ,ముస్లిం ల తో ఇతర వర్గాలు పెద్ద సంఖ్యలో ఈ జోడో యాత్రలో పాలు పంచుకోవడం తో భారతీయ జనతా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు . రాహులు వేడినిచ్చే దుస్తులను లోపల వేసుకుంటున్నారని ఆయన ఫిట్ నెస్ పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు చేస్తున్న డ్రామా గా కొట్టి పారేస్తున్నారు . ఆయన విశ్రాంతి తీసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఆది జోడో యాత్ర కాదు విరామ యాత్ర అని విమర్శలు చేస్తున్నారు
.
దీనిపై బి జె పి నాయకులే కాకుండా కాంగ్రెస్ తో దోస్తీ కట్టడం లో విఫలమైన ప్రశాంత్ కిశోర్ మరో మునడుగు వేసి రాహుల్ గాంధీ ని విమర్శిస్తున్నారు . పి కె బీహార్ లో నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూ పాద యాత్ర చేస్తున్నారు . ఆర్ జె. డి. జె డి యు తనను అవకాశ వాధిగా విమర్శించడాన్ని ప్రశాంత కిషోర్ తప్పు పట్టారు . యాత్రలో మానసిక ,శారీరక దృడతవాన్ని చూపించి ప్రజలతో ఉన్నామంటే సరిపోదు అని రాహుల్ మీద సెటైర్ వేశారు .
భారత్ జోడో యాత్ర కు ప్రజల్లో రోజు రోజుకు పేరుగున్న ఆదరణను చూసి ఓర్వ లేక చేస్తున్న విమర్శలుగా కొట్టి పారేశారు. ఈ యాత్ర లో రాహుల్ గాంధీ ఒక్కరే పాల్గొనడం లేదని ప్రతి రోజు కొన్ని వేలమంది అడుగులో అడుగు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ అన్నారు. రాహులు యాత్ర కొంత మంది నాయకులకు వణుకు పుట్టిస్తోందని ఆయన అన్నారు. ప్రతికూల పరిస్తితుల్లో రాహుల్ గాంధీ పాద యాత్ర ఎలా చేయగలుగుతారో అని ఆందోళన చెందామని మద్య ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి కమల్ నాధ్ అన్నారు. ఆయన మానవ నిబ్బరం ,ప్రజలతో కలిసిపోవడం వల్ల రాహుల్ గాంధీ ప్రదాన మంత్రి అయితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ఏర్పడిందనీ మరో సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు