TT Ads

ఆండ్రాయిడ్ ఫోన్లు వదిలి ఐ ఫోన్లు కొంటున్న బీజేపీ నేతలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను టార్గెట్ చేసిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలో నేతల ఫోన్ల ట్యాపింగ్ అంశంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చర్చించారు. అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లను పక్కనపెట్టి, ఐఫోన్లను కొనుక్కోవాలని సూచించారు. లేదంటే తాము చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలు, కార్యాచరణ, పార్టీ వ్యూహాలు, పార్టీ అంతర్గత విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిపోతాయని పార్టీ నేతలకు వివరించారు. 

ఫోన్ల్ ట్యాప్ పై బీజేపీ నేతల ఫైర్

గతంలో తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు మాట్లాడుకునే అంతర్గత విషయాలను, సంభాషణలను పోలీసులు వింటున్నారని చెప్పారు. మరోవైపు ఫోన్​ట్యాపింగ్ భయంతో బండి సంజయ్ ఆండ్రాయిడ్ ఫోన్ ను పక్కన పెట్టి, ఐ ఫోన్ వాడుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఐ ఫోనే వాడుతున్నారు. ఇప్పటికే ఎంపీ అరవింద్, మాజీ ఎంపీలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, ఇతర పార్టీ ముఖ్య నేతలు కూడా ఐ ఫోన్లు వాడుతున్నారు. ఐ ఫోన్ లోని ఫేస్ యాప్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కూడా కొత్తగా ఐ ఫోన్ కొన్నట్లుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి చూపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదాధికారుల సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ పై చేసిన కామెంట్స్ పార్టీలో చర్చకు దారితీశాయి. ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఐ ఫోన్ లేని నేతలు తాము కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *