ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మరో రెండు అరుదైన అవార్డ్ లు లభించాయి . జక్కన్న రాజా మౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ లు నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం అంతర్జాతీయంగా విశేష గుర్తింపు తెచ్చుకుంది .అంతర్జాతీయంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ చితం ఎన్నో అవార్డ్ లు అంధు కోవడమే కాకుండా అరుదైన ఆస్కార్ రేస్ లో కూడా నిలబడి భారత చిత్ర రంగ వ్యాప్తిని ప్రపంచ వ్యాప్తంగా నిలిపింది .
తాజాగా, మరో రెండు విదేశీ అవార్డులు కూడా ఆర్ఆర్ఆర్ ను వరించాయి. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీని కూడా ఆకట్టుకుంది.