సినీనటి ప్రముఖటాలీవుడ్ యాంకర్ అనసూయ ఓ వ్యక్తి తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజు పై4 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు నిందతుడికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది
ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ టెలిగ్రామ్ యాప్స్ లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు అనసూయ ఆరోపించారు ఈ మేరకు ఆమెఈనెల 17 వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేశారు
కొంతకాలంగా రామ వెంకట వీర రాజు సాయి రవి 267 ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా హీరోయిన్స్ ఫోటోలు పెట్టి అసభ్యకర వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారు
నిందితుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు
వీర్రాజు గ మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాడుఫిలిం ఇండస్ట్రీ యాంకర్స్ హీరోయిన్స్ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు
రోజా, అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు భవిష్యత్తులో ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు