
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ శాశ్వతంగా మూసి వేత
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్ కోసం ఏర్పాటు చేసిన టెర్మినల్ ఇకపై మూతపడనుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆ టెర్మినల్‌ను మూసివేస్తున్నట్లు జీహెచ్‌ఐఏఎల్ అధికారులు వెల్లడించారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్ కోసం 2018లో హజ్ టెర్మినల్ సమీపంలో నిర్మించిన టెర్మినల్‌ను రేపు 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేస్తున్నారు.విమానాశ్రయ విస్తరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
దీనికి ప్రత్యామ్నాయంగా ప్రధాన టెర్మినల్‌ను సిద్ధం చేశామని, విమాన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.సౌదీ ఎయిర్‌లైన్స్ ఎస్‌వీ-753 తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్ సౌదీ అరేబియాకు ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన టెర్మినల్ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అదనపు వివరాలకు 040-66546370 నంబరులో సంప్రదించాలని సూచించారు…