.మీ అందరి తరపున తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతులు చెబుతున్నా. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. దేశప్రజలందరూ సంతోషంగా ఉండాలని అంబేద్కర్ ఆకాంక్షించారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజంలో మార్పు కోసం ఆయన అహర్నిశలు తపించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారు.
► దళిత బంధు విజయగాథ పాటల సీడీని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్‌లు.
► అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. చారిత్రాత్మకం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని భారీగా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అమలు అవుతున్న దళిత బంధు పథకం.. ఒక విప్లవాత్మక మార్పును దోహదం చేస్తుంది.