
*అలంపూర్ BRSలో వర్గపోరు..అందరూ ఎమ్మెల్యేకు వ్యతిరేకమే!
అబ్రహాం అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా వ్యతిరే కిస్తున్న అయిజ మండల. బీ ఆర్ ఎస్ శ్రేణులు
అలంపూర్ నియోజక వర్గంలో అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అయిజ మండల బీ ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు , mptc లు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. పలువురు నాయకులు ప్రసంగిస్తూ కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అలంపూర్ నియోజకవర్గ పరిధిలో కమిషన్లు అవినీతి దౌర్జన్యకాండ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అలంపూర్ నియోజకవర్గంలో లోని ప్రజలకు బి ఆర్ఎస్ పార్టీ పైన కానీ కెసిఆర్ నాయకత్వం పైన గానీ చల్లావెంకట్రామిరెడ్డి నాయకత్వం పైన కానీ నమ్మకం ఉన్నది …ప్రస్తుతము అలంపూర్ తాలూకాలో ముఖ్యమైన కార్యకర్తలందరూ నీతి ,నిజాయితీ, సంక్షేమం ,అభివృద్ధి ఆశిస్తున్న నాయకుని వెంట ఉన్నారు…. కమిషన్లు, అవినీతి ,దౌర్జన్యం ,రియల్ ఎస్టేట్ అక్రమాలు చేసేవాళ్లు ఒకరి వైపు ఉన్నారు . మొదటిసారి అబ్రహం ఎమ్మెల్యే అయినప్పుడు రెండు చేతులతో దోపిడీ జరిగింది కానీ ఆయన రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాలుగు చేతులతో దోపిడీ జరుగుతున్నది . ఇది అందరికీ తెలిసిన విషయమే …అలంపూర్ తాలూకా బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గత రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అబ్రహం గారికి వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు . అయినా అబ్రహం గారి తీరు మారలేదు… టెంపుల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ లకు కూడా డబ్బులు తీసుకుని నియమించడం ఎంతవరకు సమంజసం ….ఇది వాస్తవం కాదా !! ……..ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అబ్రహాం నాయకత్వంలో పని చేయలేమన్నారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో అబ్రహామ్ కు ఓట్లు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ఆయన నడవడిక సరిగా లేకపోవడం, ఒంటెద్దు పోకడ లతో ప్రజలు, నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయన చేసిన అవినీతి వల్ల alampur అభివృద్ధి కుంటుపడుతుంద న్నారు. అందరూ కలిసి కట్టుగా ఉండి అబ్రహాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఐజ మండల బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అలంపూర్ బి ఆర్ఎస్ టికెట్ ను మార్చి ఎవరికిచ్చినా అత్యధిక మెజార్టీతో గెలిపించగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని వారు విజ్ఞప్తి చేశారు…
ఎం కార్యక్రమంలో సీనియర్ నాయకులు , సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు