TT Ads

ఏపిలో మూడు ప‌ట్ట‌బ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌లో అధికార వైసీపీకి ప‌ట్ట‌బ‌ద్రులు షాకిచ్చారు .. వీటిలో రెండు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానానికి జ‌రుగుతున్న కౌంటింగ్ రెండ‌వ ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపులో రౌండు రౌండుకు మెజారిటీ మారుతూ ఇరువురి మ‌ద్య విజయం దోబూచులాడుతోంది.

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. శాసన మండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరించి విజయకేతనం ఎగురవేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం ఎదురుగాలి వీచింది. టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టంగట్టారు. *తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపుని సొంతం చేసుకున్నారు*. అంతేకాదు పశ్చిమ రాయలసీమలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది.. రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఎక్కువగా ఫలితాలు వెల్లడయ్యాయి.

*తూర్పు రాయలసీమలో..*

తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్పష్టమైన ఆధిక్యంతో గెలుపుని సొంతం చేసుకోవడంతో చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో టిడిపి శ్రేణుల భారీ ర్యాలీని నిర్వహించారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా టిడిపి కార్యకర్తలు ర్యాలీని నిర్వహించారు. మరోవైపు పలమనేరులో తెలుగు తమ్ముళ్ళ సంబరాలు చేసుకున్నారు. మదనపల్లి బెంగళూరు బస్టాండ్ లో బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు టీడీపీ మైనారిటీల నేతలు. రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ .. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డిపై విజయాన్ని సొంతం చేసుకున్నారు. కంచర్ల శ్రీకాంత్‌ 1,12,686 ఓట్లు సాధించగా.. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది. అయితే శ్రీకాంత్ విజయాన్ని రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఉత్తరాంధ్రలో …

మరోవైపు ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90% తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో సాధించారు.

మరోవైపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి వేపాడ‌ చిరంజీవిరావుకు అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. అయితే కౌంటింగ్ పూర్తి అయినప్పటికీ డిక్లరేషన్ విషయంలో సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ అనుమతితో చిరంజీవి రావుకు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *