తమిళనాడులో_బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఆరుగురు మృతి 15 మందికి తీవ్ర గాయాలు.

0
2

మధురైలోని తిరుమంగళం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అగుజైలు గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా,15మందికి గాయపడ్డారు.వీపీఎం బాణాసంచా కర్మాగారంలోని మూడు భవనాల్లో వల్లరసు అనే కార్మికుడితో సహా నలుగురు పురుషులు, ఒక మహిళ పనిచేస్తుండగా ఒక్కసారిగా భవనంలో పటాకులు పేలి మూడు భవనాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో  అమ్మాసి, వల్లరసు, గోబి, విక్కీ, ప్రేమ ,తో పాటు మరో వ్యక్తి   ప్రాణాలు కోల్పోయారు గాయ గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు దానిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది _

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వాణిజ్య పన్నులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పి మూర్తి, కలెక్టర్ డాక్టర్ ఎస్ అనీష్ శేఖర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  మృతులకు సంతాపం తెలిపారు మరియు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు

బాణాసంచా కర్మాగారంలో జరిగిన దుర్ఘటనపై గవర్నర్ రవి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు మరియు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here