
Breaking News
ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్.
మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్న.
ప్రజా స్వామ్యాన్ని అధికార టీఆరెఎస్ పార్టీ దుర్వినియోగం చేసింది.
పోలీస్ వ్యవస్థ ను వాడి విచ్చలవిడిగా బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మూడో తేది వరకు ఇక్కడే ఉండి డబ్బులు పంచారు.
డబ్బు, అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారు.
నైతికంగా నేను గెలిచినట్టే.ప్రజలు నా వెంటే ఉన్నారు.
పది వేల ఓట్లు ఉన్న బీజేపీ 90వేల ఓట్లు సాధించింది.
గొల్ల కుర్మల ఖాతాల్లో డబ్బులు వేసి ఓటు వేయకపోతే ఇవ్వమని వేదించారు.
ఓటు వేయకపోతే పెన్షన్ లు ఇవ్వబొమని హెచ్చరించారు.
ఇప్పటి వరకు ఏ ఎన్నిక లో రిటర్నింగ్ అధికారి ని సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు.
నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
నన్ను ఒడించేందుకు అసెంబ్లీ మొత్తం మునుగోడుకు వచ్చింది.
ముఖ్యమంత్రి తో సహా టీఆరెఎస్ నేతలందరిని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన.
మునుగోడు లో ఓటు హక్కును కూడా వినియోగించుకోనివ్వలేదు.
అధర్మం మాత్రమే మునుగోడులో గెలిచింది.
భవిష్యత్తు లో నా పోరాటం కొనసాగుతుంది.
కమ్యూనిస్టు ల కంచుకోటాలో వామ పక్షాలు ముఖ్యమంత్రి కి అమ్ముడు పోయారు.
నా పదవిని మునుగోడు ప్రజల కోసం త్యాగం చేశాను.ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతుంది.