
తెలంగాణ రాష్ట్ర సర్కస్ సోమవారం మరో నామినేటెడ్ పదవిని భర్తీ చేసింది ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వర్ధమానుకోట గ్రామానికి చెందిన సీనియర్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు సోమ భారత్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్గా నియమించింది. సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. సోమ భరత్ కుమార్ ఈ పదవిలో రెండేళ్ళు కొనసాగుతారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడు, సోమ భరత్ కుమార్ ను ముఖ్యమంత్రి నామినేటెడ్ పదవిలో నియమించడం పట్ల తెలంగాణ ఆర్యవైశ్య పొలిటికల్ చైర్మన్ సంజయ్ కుమార్ విడియాల హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యులకు ఇస్తున్న ప్రాముఖ్యత వల్ల తమ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఇస్తున్నారని సంజయ్ విడియాల అన్నారు