ఘనంగా ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూర్ వెంకట్ జన్మదిన వేడుకలు

0
2

AMN INDIA : 

ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూర్ వెంకట్ జన్మదిన సందర్భంగా బుధవారం ఎన్ ఎస్ యు ఐ సిద్దిపేట జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్, ర్యాషాద్ ఆధ్వర్యంలో అభయజ్యోతి వికలాంగుల మన వికాస కేంద్రంలో నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అజ్మత్, ర్యాషాద్ మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నిరంతరం విద్యార్థుల కోసం పోరాడుతున్నారు అని అన్నారు. కరోన కష్ట కాలంలో విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేసి అటు పదోవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థుల కోసం పోరాడి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి విద్యార్థుల గుండెల్లో నిలిచిపోయారు అని అన్నారు. రాష్ట్ర లో విద్యార్థుల కోసం ఎన్ ఎస్ యు ఐ అండగా ఉంటుందని అని అన్నారు.వెంకట్ విద్యార్థుల కోసం ఎన్నో సార్లు జైలు కి పోయారు అని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నాయకత్వం లో ఎన్ ఎస్ యు ఐ ని బలోపితం చేస్తాం అని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర లో కేంద్ర లో వస్తుంది మరియు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు దావూద్, జూనిద్,జవీద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here