
ఇక ఆధార్ కార్డు కూడా రెన్యువల్ చేసుకోవాల్సిందే ఒకవేళ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు చెల్లకుండా పోతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది .ఆధార్ కు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి 10 ఏళ్ల పూర్తయ్యాక కార్డుదారుడి సమాచారాన్ని కనీసం ఒక్కసారైనా అప్‌డేట్ చేయడాన్ని తప్పనిసరి చేసింది.
సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రెపాజిటరీలో కచ్చితమైన ఆధార్ సమాచారాన్ని కొనసాగించేందుకు ఈ అప్‌డేట్ దోహదపడనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
‘‘ ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులు మొదట పది సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాల లో ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలి సీఐడీఆర్‌లో ఖచ్చితమైన సమాచారాన్ని కొనసాగించేందుకు కాలానుగుణంగా తమ ఐడెంటిటీ నివాస ధ్రువీకరణ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి’’ అని గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది