TT Ads

మునుగోడు ఎన్నికల పై  తెలంగాణ  B.J.P.  Incharge తరుణ్ చుగ్   స్పందన

84 మంది ఎమ్మెల్యేలను, 16 మంది మంత్రులను, 15 మంది ఎమ్మెల్సీలను, 10 మంది ఎంపీలను, మొత్తం పోలీసు వ్యవస్థను మునుగోడులో మొహరించినప్పటికీ, కేసీఆర్ రెండుసార్లు బహిరంగ సభలను పెట్టినప్పటికీ, పథకాలు రాకుండా చేస్తామని ప్రజలను బెదిరించి

భయబ్రాంతులకు గురిచేసినప్పటికీ, అనేక దాడులకు పాల్పడి తప్పుడు కేసులు బనాయించినప్పటికీ భారతీయ జనతా పార్టీపై కేవలం 10,309 ఓట్ల మెజారిటీని మాత్రమే సాధించడం, తెలంగాణ ప్రజలలో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తికి అద్దం పడుతోంది.
కాంగ్రెస్ కంచుకోట లాంటి మునుగోడులో ఆ పార్టీ గెలుపు సంగతి అంటుంచితే, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనని తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం సహా మునుగోడు ప్రజలకు అనేక హామీలను గుప్పించి మంత్రులు ప్రచారం చేసిన చోటా బిజెపి ఆధిక్యం సాధించడం చూస్తే టీఆర్ఎస్ పట్ల ప్రజలకున్న అపనమ్మకాన్ని తెలియజేస్తోంది.


మొత్తం అసెంబ్లీని, అధికారాన్ని ఉపయోగించినా స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ సాంకేతికంగా విజయం సాధించినప్పటికీ, నైతిక విజయం మాత్రం బిజెపిదే. టీఆర్ఎస్ నాయకులు బిజెపిపై, ఎన్నికల గుర్తులపై విమర్శలు చేయడం మానుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి.
ముఖ్యమంత్రితో సహా మునుగోడు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ తమ తమ హామీలను నిలబెట్టుకోవాలని, 15 రోజుల్లోపు చేస్తామన్న అభివృద్ధిని చేసి చూపించాలని టీఆర్ఎస్ నాయకులకు స్పష్టం చేస్తున్నాను.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *